Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కదిరి గేటు వద్ద గల నేతన్న విగ్రహం వద్ద10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా సిపిఐ నాయకులు, చేనేత కార్మిక సంఘం నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తొలిత నేతన్న విగ్రహానికి పూలమాలవేసి అనంతరం పట్టణ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ
సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరం లో ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారిన చేనేతల తలరాతలు మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరమగ్గాల నుండి చేనేత పరిశ్రమను కాపాడాలని ,అలాగే నేతన్న నేస్తం పథకాన్ని 24 వేల నుండి 36 వేలకు పెంచి, సొంత మగ్గం ఉన్న వారితోపాటు కూలి మగ్గం నేసే వారికి ఉపవృత్తుల వారికి కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. చేనేత పై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ ని రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని, వృత్తి పరికరాలను సబ్సిడీతో పంపిణీ చేయాలని, 11 రకాల చేనేత వస్త్ర ఉత్పత్తులను రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని తెలిపారు.వస్త్ర ఉష్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జౌ లి శాఖ నుండి చేనేతను విడదీసి, చేనేత పరిశ్రమను కాపాడా లన్నారు. చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని, చేనేత కార్మికులకు మూడు సెంట్లు స్థలం ఇచ్చి, పక్కా ఇల్లు వర్క్ షెడ్డును ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి అని తెలిపారు. సిల్క్ రాయితీని 2000 రూపాయల నుండి మూడు వేలకు పెంచాలని, చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తును అమలు చేయాలి అని, ముద్ర రుణాలు ఇచ్చి న ప్రతిసారి సబ్సిడీ ఇవ్వాలి అని, ప్రసూతి సమయంలో నెలకు 5000 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం గా డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం ఉపాధ్యక్షులు వెంకటస్వామి, చేనేత సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్, రమణ, శ్రీధర్, ఆదినారాయణ, బాబు, శ్రీనివాసులు, బాల రంగయ్య ,సురేష్, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img