గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖలో జాతీయ గ్రంథాలయ దినోత్సవ వేడుకలు గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, పాఠకుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్. ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ గ్రంథాలయ జాతీయ వారోత్సవాలకు డాక్టర్ రంగనాథ్ చేసిన సేవలను వారు కొనియాడారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. ప్రతి గ్రంథాలయం అందరికీ విజ్ఞానాన్ని,నైపుణ్యాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రతిరోజు గ్రంథాలయంలో రావడం, చదువుకు సంబంధించిన, వివిధ ఉద్యోగ పోటీలకు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మా గ్రంథాలయంలో సభ్యత్వమును ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని, దాతల సహకారంతో గ్రంథాలయ రుసుమును ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. గ్రంథాలయములో సభ్యత్వ కార్డు కావాలి అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డును సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ, శివమ్మ, రమణ, గంగాధర్, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.