జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎన్ డి ఏ ప్రభుత్వం కృషి చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో నిర్వహించిన ఇది ప్రభుత్వం అనే కార్యక్రమంలో, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసిపి విధ్వంస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తిని కలిగించి పునర్నిర్మాణ దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో 100 రోజుల పాలనలో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వారు తెలిపారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరించే దిశలో అధికారులను ఆదేశించడం జరుగుతోందని తెలిపారు. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది పోస్టర్స్ కూడా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.. అదేవిధంగా వ్యవసాయంలో ఆధునికతను అందిపుచ్చుకోవాలని రైతులను కోరి ప్రభుత్వం అందజేస్తున్న డ్రోన్ల పనితీరును గమనించి, తక్కువ ఖర్చు శ్రమతో పొలాలకు ఎరువులు మందులు పిచికారి చేయడానికి డ్రోన్లను సమర్ధంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు,, కార్యకర్తలు పాల్గొన్నారు.