విశాలాంధ్ర -ధర్మవరం : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం తప్ప మరే ఇతర పెన్షన్ స్కీములు వద్దని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి డిమాండ్ చేశారు.. సోమవారం రోజున ధర్మవరం యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో స్థానిక ధర్మవరం జోన్ యూటీఎఫ్ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలు చేస్తామని చెబుతున్న గ్యారెంటీ పెన్షన్ స్కీం (జిపిఎస్) విధానం వల్లే ఉన్న పెన్షన్ స్కీంను కేంద్ర ప్రభుత్వం కూడా స్వల్ప మార్పులతో యూనిఫైడ్ పెన్షన్ స్కీంను (యుపిఎస్) దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వం యుపిఎస్ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు అదనంగా వనగూరే ప్రయోజనం ఏమీ లేదని కావున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ (సిపిఎస్), గ్యారెంటీ పెన్షన్ స్కీం(జిపిఎస్), ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తానంటున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యుపిఎస్ )విధానమును రద్దుచేసి, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని తెలిపారు. సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని లేనియెడల మా పోరాటాలను వేగవంతం చేస్తామని తెలిపారు. పలు గఫాలుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరంతర పోరాటాలు సాగించిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు,అమర్ నారాయణరెడ్డి, లక్ష్మయ్య, సకల చంద్రశేఖర్, రామాంజనేయులు, సాయి గణేష్, ఆదిరెడ్డి, లక్ష్మీనారాయణ. తదితరులు పాల్గొన్నారు.