London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర-ధర్మవరం;; పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలను కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్ నాయక్, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి, మడకశిర రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుబ్బయ్య హాజరు కావడం జరిగింది. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్, ముఖ్య అతిథులు మాట్లాడుతూ
విద్యార్జన దశ లో జాతీయ సేవా పథకం, ప్రతి విద్యార్థి జీవితాన్ని బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది అని అన్నారు.విద్యార్థుల్లో సేవా గుణాన్ని ప్రోది చేస్తుంది అని, సమాజంలో ఐక్యతను ఏర్పర్చి, మనదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, దేశ గొప్పతనం, ఒక గౌరవప్రదమైన పౌరుడుగా మనల్ని తీర్చి దిద్దుతుంది అని తెలిపారు. మానవ సేవయే మాధవసేవగా దిశ గా మనం అందరం పనిచేయాలని, పెద్దవాళ్లను, తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు. భారత ప్రభుత్వం – “స్వచ్ఛత హి సేవా ప్రచార కార్యక్రమం “లో భాగంగా “స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత” కార్యక్రమాల ద్వార సమాజానికి విద్యార్థులు దగ్గరయ్యేలా మన ప్రభుత్వం చర్యలు చేపట్టి అవకాశాలను కల్పిస్తుందని తెలియచేశారు. 2021-2024 విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ సర్వీస్ సర్టిఫికేట్ , స్పెషల్ క్యాంప్ సర్టిఫికేట్స్ ప్రధానం చేశారు. ఉత్తమ వాలంటీర్లకు మొమెంటోస్ ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్లు అందచేసారు. ఉత్తమ వాలంటీర్ గా, యమ్ ఎస్. ఉదయ్ కిరణ్, (బి ఎ). ఎస్. లోకేశ్వరి, (బి ఏ)మూడవ ఉత్తమ వాలంటీర్ గా కె.మధు సుధన్.(బీకాం )మూడవ సంవత్సరం విద్యార్థులకు ధృవపత్రాలును అందజేసారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. త్రివేణి, డాక్టర్ బి. గోపాల్ నాయక్, డాక్టర్ ఎస్. షమీఉల్లా, డా. ఎస్.చిట్టెమ్మ, ఎ. కిరణ్ కుమార్, ఎస్ .పావని, యం.భువనేశ్వరి, యం.పుష్పావతి, యం.సరస్వతి, బి. ఆనంద్, వి.హైమవతి, వై . తాహిర్ అలీ, వెంకట లక్ష్మి ..తదితర అధ్యాపక, అధ్యాప కేతర బృందం , ఎన్. ఎస్. ఎస్ .వాలంటీర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img