ఎంపీడీవో అబ్దుల్ నబీ
విశాలాంధ్ర -ధర్మవరం:: ప్రణాళికల కార్యక్రమాలలో అధికారులు తప్పక ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని ఎంపీడీవో అబ్దుల్ నబీ, మండల నోడల్ ఆఫీసర్, పబ్లిక్ హెల్త్ అధికారి నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రణాళికలపై చర్చించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వికసిద్భారత్2047 లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వచ్చే ఐదు సంవత్సరాలకు ప్రణాళికలు రూపొందించాలని అవగాహన కార్యక్రమంలో వారు తెలిపారు. వికసిత్ భారత్ ప్రణాళికలపై తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలని, మండలంలోని గ్రామాలలో ఆయా శాఖలకు సంబంధించిన జరిగిన పనులు, జరగబోయే ఐదు సంవత్సరాలకు అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప గణాంక అధికారి గోపాల్ మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు అధికారి, మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.