విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని చంద్రబాబు నగర్ లో రంగస్వామి అనే వ్యక్తి విద్యుత్ షాకుకు గురై మృతి చెందాడు. ఈ సమాచారాన్ని అందుకున్న తారచేయుట ట్రస్ట్ ఆ కుటుంబాన్ని సంప్రదించింది. అంత్యక్రియలు కూడా జరపడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి పట్టణ మహాదాత అయిన సంధ రాఘవని సంప్రదించగా అప్పటికప్పుడే పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి తారక్ చేయుట ట్రస్ట్ వారు ఆ కుటుంబానికి అందజేశారు. ఇప్పటికే సం దా రాఘవ పట్టణంలో దాతగా, పట్టణ ప్రముఖులుగా, సేవా తత్పరుడు గా గుర్తింపు పొందారు.