డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఈనెల 18వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శన కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాను పోను చార్జీలు 1400 రూపాయలు ఉంటుందని, దర్శనానికి వెళ్లవలసిన భక్తాదులు ఆన్లైన్లో గాని బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్లో గాని సీట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కలదు అని తెలిపారు. భగవంతుని సేవలో భక్తులు!, భక్తుల సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 6303151302 కు గాని 9959225859 కు గాని సంప్రదించాలని తెలిపారు.