లయన్స్ క్లబ్ ప్రతినిధులు
విశాలాంధ్ర -ధర్మవరం : పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు వెంకటస్వామి వారి సూచనల మేరకు పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుట్టపర్తి ఈవో ఆర్ డి- అశోక్ కుమార్ రెడ్డి హాజరైనరు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ నేటి ఈ శిబిరానికి కీర్తిశేషులు, మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గవ్వల లక్ష్మీనారాయణ (లడ్డు) వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఉచిత కంటి చికిత్స శిబిరానికి దాతల సహాయ సహకారంతో నిర్వహిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతోందని, అంతేకాకుండా ఉచితంగా అద్దాల పంపిణీ కూడా చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ప్రజలందరికీ వివిధ సేవా రూపాలలో సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెల నిర్వహించబడే ఉచిత కంటి చికిత్స శిబిరానికి శిబిర ధాతలే మూల కారకులుగా ఉంటున్నారని, వారి సహాయ సహకారాలతోనే ఇంతవరకు పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 95 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 54 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిని పట్టణములోని ఎర్రగుంట లో గల లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ముఖ్య అతిథి అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి సేవలు పేద ప్రజలకు ఒక వరం లాగా మారాయని, వేల రూపాయలతో కూడుకున్నటువంటి కంటి ఆపరేషన్లను, ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా ఆపరేషన్ ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. తదుపరి పేద ప్రజల తరఫున వారు లయన్స్ క్లబ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ వారు ముఖ్య అతిధిని, శిబిర దాతను ఘనంగా సత్కరించారు. అనంతరం శిబిరములో పాల్గొన్న 95 మందికి దాత చేతుల మీదుగా భోజనపు ప్యాకెట్లను, వాటర్ బాటిల్ లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె గోపాల్, ఉట్టి శివప్రసాద్, చందా నాగరాజు, కొత్తపాలెం కుమార్, ఆప్తాల మీక్ అసిస్టెంట్ నాగేంద్ర, కృష్ణమూర్తి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.