శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు వైద్యం చేయడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని తొగటవీధిలో శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవాలయం ఆవరణములో ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు 13వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ డాక్టర్లచే ఈ వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తూ, ఉచితంగా వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా శీలం సావిత్రమ్మ, శీలం శ్రీ రాములు వారి కుమారుడు శీలం రమ్య నాగిని, శీలం జయ ప్రకాష్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వైద్యులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప-దంత వైద్యులు, డాక్టర్ వెంకటేశ్వర్లు-చిన్నపిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సాయి స్వరూప్- జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ సతీష్ కుమార్- ఎముకల వైద్య నిపుణులు, డాక్టర్ జైదీప్ నేత- గ్యాస్ట్ర ఎండ్రాలజిస్ట్ హైదరాబాద్, డాక్టర్ విట్టల్ దత్త వైద్యులు వైద్య చికిత్సలను నిర్వహిస్తారని తెలిపారు. దాతల సహాయ సహకారాలతోనే ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని పేద ప్రజలు వృద్ధులు, సద్వినియోగం చేసుకొని, తమ ఆరోగ్యముని పదిలంగా చేసుకోవాలని తెలిపారు.