హలో ధర్మవరం సోషల్ మీడియా నిర్వాహకుడు ప్రదీప్
విశాలాంధ్ర -ధర్మవరం:: మన రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని హలో ధర్మవరం సోషల్ మీడియా నిర్వాహకుడు ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన హలో సోషల్ మీడియా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణములో కళా జ్యోతి సర్కిల్ దగ్గర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల యందు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మెగా రక్తదాన శిబిరమును ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. కావున ఆసక్తిగల రక్తదాతలు పట్టణ ప్రజలందరూ పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు. రక్త దాతలు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9100362090 అని తెలిపారు.