విశాలాంధ్ర- ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ కార్యదర్శి నాగభూషన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలిలో సెప్టెంబర్ నెల 8వ తేదీ ఆదివారం నిర్వహించబడే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్యాంపు చైర్మన్ గా రామకృష్ణ వ్యవహరిస్తారని, బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లను నిర్వహిస్తూ భోజన సదుపాయాలు రవాణా సౌకర్యం కూడా ఉచితమని తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత అద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. కావున పట్టణము గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు ఈ శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు అక్కమ్మ వెంకటప్ప ల జ్ఞాపకార్థం కుమారుడు రాజారెడ్డి, సావిత్రమ్మ వ్యవహరిస్తారని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ సమాజంలో రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని తెలిపారు. ఇప్పటివరకు దాదాపుగా 34 వేల మందికి కంటి ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు రత్నశేఖర్ రెడ్డి,సత్రశాల ప్రసన్న కుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కొండయ్య, నరేందర్ రెడ్డి, మనోహర్ గుప్తా పాల్గొన్నారు.