విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా ధ్యేయము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్ పాస్ట్ ప్రెసిడెంట్ బండ్లపల్లి రంగనాథం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వాతి క్లినిక్ లో ఈనెల నాలుగవ తేదీ బుధవారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కంటి శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా వారి సౌజన్యంతో, నేత్రాలయ ఐ క్లినిక్ వారి సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారిచే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరం ఎన్టీఆర్ సర్కిల్లో గల నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉంటుందని తెలిపారు. శిబిరంలో కంటి శుక్లములు గల వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ నిబంధనల ప్రకారం ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. కంటి రోగులు ఈ శిబిరమునకు వచ్చేవారు మీ ఆరోగ్యశ్రీ లేదా ఈ హెచ్ ఎస్ కార్డ్ తో పాటు బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డ్ తీసుకొని రావలెనని తెలిపారు. కంటి ఆపరేషన్ కు ఎంపికైన వారిని అదే రోజు కడప హాస్పిటల్కు తీసుకొని పోవడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటిచూపును తెప్పించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9886643560కు సంప్రదించాలని తెలిపారు.