విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల గత కొద్ది రోజుల కిందట విజయవాడ వరద ముప్పుతో ఎన్నో ఇబ్బందులతో పాటు అనేకమంది చనిపోవడం జరిగింది. తినడానికి తిండి లేక, పడుకోవడానికి స్థలము లేక, నిద్రలేక ఎన్నో కష్టాలను విజయవాడ వాసులు భరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా అనునిత్యం విజయవాడ వరద బాధితులను ఆదుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జెఆర్ సిల్క్స్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జింకా రామాంజనేయులు తనవంతుగా 15 లక్షల రూపాయల విలువ గల చెక్కును నేరుగా విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో అందజేశారు. జింక రామాంజనేయులు ధర్మవరం మండలంలోని నాగులూరు గ్రామంలో జేఆర్ సిల్క్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను నడుపుతున్నారు.అనంతరం స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయడానికి ముందుకొచ్చిన జింక రామాంజనేయులు ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా అభినందించారు. తదుపరి నారా లోకేష్ ను కూడా కలిసి వారి వద్ద కూడా గౌరవ మర్యాదగా కలవడం జరిగిందని తెలిపారు. వీరి సహాయం పట్ల కూడా నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు.