విశాలాంధ్ర, కదిరి : కదిరి రూరల్ సీఐగా పి. నాగేంద్ర బాధ్యతలు చేపట్టారు. బదిలీలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసి న్యాయం పొందాలన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనానికి సంభందించిన పత్రాలను కలిగి వుండి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలన్నారు.