విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయమునకు కాంట్రాక్ట్ బేసిక్ లో 14 మంది క్లాప్ ఆటోలో డ్రైవర్లుగా కొనసాగిస్తున్నారు. గత ఏడు నెలలుగా జీతాలు రావడం లేదని, మా కుటుంబ పరిస్థితి యొక్క జీవనాధారం అతి కష్టంగా తయారయిందని బాధను వ్యక్తం చేశారు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నామని, అప్పుల వాళ్లు ఒత్తిడి కూడా ఎక్కువ అయిందని వాపోయారు. అధికారులకు సంబంధిత కాంట్రాక్ట్ లకు తెలిపిన కూడా ప్రయోజనం లేదని బాధను వ్యక్తం చేశారు. జీతాలతో ఆధారపడి బ్రతికే మాలాంటి వారి పరిస్థితి, అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేలు గమనించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పటికైనా మా ఏడు నెలల జీతాలు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలుపుతున్నారు.