డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు అందరూ కూడా తప్పనిసరిగా వైద్యుల యొక్క సలహాలతో పాటు జాగ్రత్తలు కూడా తప్పక పాటించాలని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సాల్మన్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుర్గా నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. విరాళ దాతగా చిన్నప్ప వ్యవహరించడం జరిగింది. అనంతరం డిప్యూటీ డిఎంహెచ్వో మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు. గర్భిణీ స్త్రీలు మంచి వైద్య చికిత్సలు తో పాటు డాక్టర్ యొక్క సలహాలు స్వీకరించినప్పుడే ప్రశాంతమైన జీవితం లభిస్తుందని తెలిపారు. ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవములు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి చంద్రిక, కంటి వైద్యాధికారి ఉరుకుందప్ప, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షులు జింక చిన్నప్ప, సంయుక్త కార్యదర్శి మంజునాథ్, సంస్థ సిబ్బంది వేణుగోపాల్ రామకృష్ణ మనోహర్ గుప్తా చంద్రశేఖర్ సాయి ప్రసాద్, రామకృష్ణ 50 మంది గర్భిణీ స్త్రీలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.