విశాలాంధ్ర చిలమత్తూర్ రూరల్ : మండల పరిధిలోని చెరువుల ఆక్రమణను అరికట్టాలని ,ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు నాయకులు కోరుతున్నారు. మండల పరిధిలోని ఆదేపల్లితండా సమీపంలో గల 964/2 వడ్డివానికుంట13.85 సెంట్లు,చెరువుభాగంలోపలువురురైతులుదురాక్రమణచేసి ఆ ప్రదేశంలో హద్దులు వేసుకుని చెరువు ఎక్కడ అనేలా చేస్తున్నారు, దీంతో చెరువు కనుమరుగయ్యేలా ఉంది, కొంతమంది ధనార్జనే దేయముగా ఆక్రమించి తెగిన కాటికి అమ్మేస్తున్నారని వినికిడి, అంతేకాక చెరువు భూభాగాలను అధిక ధరలకు అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తుంది, మండల వ్యాప్తంగా చెరువు భూభాగాలు కనబడితే చాలు(FTL) ఫుల్ ట్యాంక్ లెవెల్ భూభాగాన్ని అధికారుల అండదండలతో ఆక్రమించుకొని, అమాయకుల పేర్లు మీద రిజిస్టర్లు చేయించి, మరల వారి పేరు మీద రిజిస్టర్లు చేసుకొని ,మ,మ, అనిపిస్తున్నారు, మరికొందరు ఏకంగా పంటలు వేసుకుని, అడిగే వారు లేరు కదా అంటూ చెరువు భూభాగాలను తెగనమ్మి సొమ్ము చేసుకుంటున్నాను, మండల వ్యాప్తంగా పలు చెరువులలో ఈ విధంగా కబ్జా చేసిన చెరువులు మరిన్ని ఉన్నాయని, ఈతంగాన్ని చూసిన రైతులు పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులలో స్పందన లేకపోవడంతో పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నాను అధికారులలో చలనం లేకపోవడం లో ఆంతర్మేమిటోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు భూభాగాలను(FTL) దురాక్రమ కాకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.