విశాలాంధ్ర, కదిరి : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద జిల్లా ఎస్సీ చైర్మన్ కదిరప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చిత్రపటానికి పూల మాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి పంచి పెట్టారు.21వ దశాబ్దంలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశా నిర్దేశం చేశారన్నారు.దేశ ప్రధానిగా ప్రతిపక్ష నేతగా యువతరంలో శక్తివంతమైన మార్పును రాజీవ్ గాంధీ ఆకాంక్షించారన్నారు.ఈ కార్యక్రమంలో గాలివీడు ఉపేంద్ర,భాస్కర్,తిప్పన్న, శ్రీనివాసులు,సాయి,దేవా, డిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.