రాయపాటి శివ
విశాలాంధ్ర- ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని పట్టణ 36వ వార్డు టిడిపి ఇన్చార్జ్ రాయపాటి శివ, వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట రైల్వేటేషన్ రోడ్డు లో గల సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో కిమ్స్ సవేరా హాస్పిటల్ సహకారంతో ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి శివ, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కీర్తిశేషులు మా నాన్న రాయపాటి గంగాధర్ నాయుడు జ్ఞాపకార్థం ఈ శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో జి ఆర్ బి ఎస్, బిపి, ఈసీజీ, 2 డి ఏకో ఉచితంగా నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా గుండె నొప్పి, చాతి నొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్ళు తిరగడం, గుండెల్లో మంట కలగడం, చాతి బరువుగా ఉండడం, నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడం, కాళ్లు వాపు రావడం, చమటలు పట్టడం లాంటి సమస్యలు కూడా డాక్టర్ హరీష్ చే వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో 168 మంది రోగులు కు వైద్య చికిత్సలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వైద్య శిబిరమును కిమ్స్ సవేరా హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించినందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి శైలజ, కార్యనిర్వాహన కులు సురేష్ చౌదరి, మంత్రి ముఖ్య అనుచరుడు హరీష్ కుమార్, పురుషోత్తం గౌడ్, నాగ శేషు నాయుడు, సిబిఎన్ రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.