మండల వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర- ధర్మవరం: ఖరీఫ్ 2024 సంవత్సరమునకు సంబంధించి వర్షాభావ పరిస్థితులకు పంట పెట్టని రైతుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం 80 శాతము సబ్సిడీ క్రింద ఉలవలు, పెసలు, అలసందలు విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది అని, కావున రైతులు ప్రస్తుత సీజన్ నందు ఎటువంటి పంట వేయని రైతులు ప్రత్యామ్నాయ విత్తనము కొరకు సంబంధిత రైతుసేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముస్తాప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పంట వేసిన తర్వాత కచ్చితముగా ఈ పంట నమోదు చేయించుకోవాలని రైతులకు తెలిపారు. 80 శాతం సబ్బిడీ పోను రైతులు చెల్లించవలసిన ధర ఉలవలు(10 కేజీలు) 174 రూ., పెసలు (4 కేజీలు) 104 రూ, అలసందలు (10 కేజీలు)- 226 రూపాయలు చెల్లించాలన్నారు.
ఖరీఫ్ సీజన్ నందు సాగుచేసిన పంటలను రైతులు ఈ పంట నందు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు.