ధర్మాంబా వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో పవర్ లూమ్స్ తొలగించాలని కోరుతూ చేనేత జౌలీ శాఖ మంత్రి సవితకు ధర్మాంబా వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చింతా శ్రీనివాసులు, చట్టా గంగాధర్ లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణములో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, అదేవిధంగా ధర్మవరంలో పవర్ లూమ్స్ ఏర్పాటు వలన చేనేతలు తీవ్రంగా నష్టపోతున్నారని, చేనేత రిజర్వేషన్ యాక్టి, జిఐ యాక్టు గురించి వివరించడం జరిగిందన్నారు. బోగస్ చేనేత సహకార సంఘాల అవినీతి అక్రమాలు గూర్చి వాటిపై సిబిసిఐడి విచారణ జరపాలని తమ కోరడం జరిగిందన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి మూడు సెట్ల స్థలం కేటాయించి, ఇల్లు, వర్క్ షెడ్ ప్రభుత్వమే నిర్మించాలని తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా చేనేత కార్మిక కుటుంబాలకు ఆహార భద్రత పథకం ద్వారా రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, బఠానీలు, ఉలవలు, అలసందలు, మొక్కజొన్నలు మొదలైన దినుసులను పంపిణీ చేయాలని తెలపడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.