వైఎస్ఆర్సిపి, ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన 125 అడుగుల విగ్రహం వద్ద, గత రెండు రోజులు క్రితం రాత్రిపూట విద్యుత్ సరఫరాను నిలిపివేసి, జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించి, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాన్ని ప్రకారం అంబేద్కర్ విగ్రహాన్ని ఇనుపరాడ్లు మారునాయుధాలతో ధ్వంసం చేయాలని, ప్రజలను భయభ్రాంతులను చేసిన టిడిపి గుండాలను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు దేవరకొండ రమేష్ ,చౌడయ్య, గుజ్జల సల్లప్ప, కునుతూరు గోపాల్, టైలర్ కిట్టు, గజ్జల శివయ్య, మోటు మర్ల్ల రమణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని, ప్రస్తుత హోమ్ మంత్రి అనిత ఎస్సి కులానికి చెందిన వ్యక్తి అయినా ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న భౌతిక దాడులు గూర్చి నోరు విప్పకపోవడం సిగ్గుచేటు అని,కావున హోం మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, అశోక్, దేవరకొండ నరసింహులు, కుళ్లాయప్ప, సాకే లక్ష్మీనారాయణ, మల్లికార్జున, భవాని, శివ తదితరులు పాల్గొన్నారు.