Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

200 దేశాలలో రోటరీ క్లబ్ విశిష్ట సేవలను అందిస్తోంది.. రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ లో దాదాపుగా 200 దేశాలకు పైగా ప్రజలకు విశేష సేవలు అందిస్తుందని రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు, క్యాంపు చైర్మన్ నరేందర్ రెడ్డి, కార్యదర్శి నాగభూషణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో(వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ-శ్రీ సత్యసాయి జిల్లా వారి సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, నాగభూషణ మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు అశ్వత్ అమ్మ జ్ఞాపకార్థం భర్త వెంకటేశులు, కోడలు పావని, కుమారుడు శ్రీధర్ బాబు, వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. శిబిరానికి 143 మంది హాజరుకాగా అందులో 89 మందిని ఆపరేషన్కు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వీరిని సోమవారము, మంగళవారము ఈ రెండు రోజులలో బెంగళూరు కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహిస్తూ, ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ వివిధ సేవలతో పాటు పోలియో వ్యాక్సినేషన్ కూడా పంపిణీ చేస్తోందని, డయాలసిస్ యూనిట్ రోగులు కూడా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ధర్మవరంలో 1994లో ప్రారంభించి, ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రతి నెల రెండవ ఆదివారం ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ, దాదాపుగా 34 వేలకు పైగా కంటి ఆపరేషన్లను నిర్వహిస్తూ, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. ఇటువంటి శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. దాతలు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ శిబిరానికి నన్ను భాగస్వాములు చేయడం నాకెంతో ఆనందంగా ఉందని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ శిబిరంలో ఇన్ డైరెక్ట్ ఆప్తల్ మెక్స్ ద్వారా కంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు ఆపరేషన్కు వెళ్లే వారికి రవాణా ఖర్చు, భోజనము, వసతి ఉచితంగా కల్పించడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి, అందత్వాన్ని నివారించి, రెండు జీవితాలలో వెలుగు నింపాలని పిలుపునిచ్చారు. అనంతరం దాత శ్రీధర్ బాబును, డాక్టర్. ఆర్యను, శంకర కంటి ఆసుపత్రి-బెంగళూరు కోఆర్డినేటర్ శివప్రకాష్ లను ఘనంగా రోటరీ క్లబ్ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్న కుమార్, బి. రామకృష్ణ, బి. శివయ్య, జి. కొండయ్య, శ్రీనివాస్ల రెడ్డి, మనోహర్ గుప్తా, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img