విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం రూరల్ సర్కిల్ ఏరియా సీఐగా ఎన్ ప్రభాకర్ పదవీ బాధ్యతలను చేపట్టారు. వీరు ధర్మవరం రూరల్, బత్తలపల్లి పోలీస్ స్టేషన్లకు సిఐగా విధులు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఉన్న సీఐ. ఆరోహణరావు పుట్టపర్తి వీఆర్ గా బదిలీపై వెళ్లారు. అనంతరం నూతన సీఐ ప్రభాకర్ మాట్లాడుతూ టేషన్లోని ఉద్యోగులతో సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ, స్టేషన్ కి మంచి గుర్తింపు తేవడం జరుగుతుందని తెలిపారు. రూరల్ ఏరియా కు సంబంధించినటువంటి కేసులన్నింటిని కూడా సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలుపుకొనవచ్చునని తెలిపారు. ప్రజలందరూ కూడా చట్టపరంగానే జీవించాలని తెలిపారు. మట్కా, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధను కనపరిస్తామని తెలిపారు. అనంతరం స్టేషన్లోని సిబ్బంది నూతన సీఐ కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.