విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త, దాత అయినటువంటి సంధ రాఘవ పట్టణంలో మరోసారి దాతృత్వమును చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని రామ్ నగర్కు చెందిన బాలము చాలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. అంత్యక్రియలకు జరుపుకొనుటకు ఆర్థిక స్తోమత లేదని సాలమ్మ కొడుకు నాగప్ప దిక్కుతోచని పరిస్థితుల్లో తారక్చేయిత ట్రస్ట్ ను సంప్రదించారు. తారక్ చేత ట్రస్ట్ వారు ప్రముఖ వ్యాపారవేత్త, దాత అయిన సంధ రాఘవను సంప్రదించగా, అప్పటికప్పుడే 6000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అంతక్రియలకు గాను అందజేశారు. ఈ సందర్భంగా తారక్ చేయుట ట్రస్టు వారు, మృతి చెందిన కుటుంబం వారు సంధ రాఘవకు కృతజ్ఞతలు తెలియజేశారు.