విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల కొన్ని రోజుల కిందట విజయవాడలో తీవ్ర దశలో వరదలు వచ్చి విజయవాడ వాసులు ఎన్నో ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు, ప్రజలు తమదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ, భర్త రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి నరసింహులు దంపతులు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్కు రెండు లక్షలు విలువ చేసే చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దంపతులు మాట్లాడుతూ మా గ్రీన్ కో అండ్ కంపెనీ ద్వారా ఇటీవలే ఐదు కోట్లు విలువచేసే చెక్కును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేయడం జరిగిందని తెలిపారు. తదుపరి సత్య కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా తాను కళాకారిణి కావున సత్య కుమార్ చిత్రాన్ని డ్రాయింగ్ ద్వారా వేసి వారికి జన్మదిన కానుకగా అందించడం జరిగిందని తెలిపారు. తన చిత్రపటాన్ని డ్రాయింగ్ రూపంలో వేసి ఎంతగానో ఆశ్చర్యపదితులను చేసిన జయ శ్రీ, డాక్టర్ నరసింహులు దంపతులకు సత్య కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.-