మంత్రి సిబ్బంది. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలంద్ర ధర్మవరం : నియోజకవర్గంలో సీజనల్ వ్యాధులు అతిసార వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ సిబ్బంది హరీష్, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏఎన్ఎం, ఇతరత్రా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి సిబ్బంది హరీష్, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ డిపిఎంఓ చిన్న కుల్లాయప్ప నాయక్, ఏసీ మధుసూదన్ రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్ లు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా రోగాలు రాకుండా ఉండేందుకు తప్పనిసరిగా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. వివిధ సీజనల్ వ్యాధులు వ్యాప్తిని నివారించడానికి చిట్కాలు తోపాటు ఆరోగ్య పర్యవేక్షణ ప్రణాళికలను వివరించడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రమైన త్రాగునీరు, నీటి శుద్ధి, పారిశుద్ధ్యం, మెరుగుపరచడం ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడానికి చర్యలను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. వైద్య సహాయం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రాంతాలలో వ్యాధి పరిస్థితి కాకుండా ప్రజా ఆరోగ్య రంగంలో ఉన్న సవాళ్లు అవసరాలను సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యం కొరకు కృషి చేయాలని తెలిపారు. ప్రజా ఆరోగ్య విషయంలో ఎక్కడా ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని, సీజనల్ వ్యాధులపై అధికారులు సిబ్బంది అవగాహన సదస్సులను నిర్వహించి, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో సీజనల్ వ్యాధులు రాకుండా కృషి చేస్తున్న అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎంలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.