విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో ప్రసిద్ధ ఉరగాద్రి చౌడేశ్వరి దేవి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆలయ ధర్మకర్త కొత్త శరత్ కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన చౌడేశ్వరి దేవి అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తుందని 4న గాయత్రి దేవిగా 5న అన్నపూర్ణేశ్వరి దేవి, 6న లలిత త్రిపుర సుందరీ దేవిగా 7న మహా చండీ దేవిగా, 8న మహాలక్ష్మి దేవిగా 9న సరస్వతి దేవిగా 10న దుర్గాదేవిగా 11న మహిషాసుర మర్దినిగా 12న దశమి శనివారం రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారని వారు తెలిపారు. ఈ శరన్నవరాత్రుల ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రెడ్డి ఆంజనేయులు, లక్క ఎర్రి స్వామి, ఆర్సీ ప్రసాద్, నిమ్మల ప్రసాద్, ఉట్టి ధనంజయ, చిట్టా రఘు, ఉట్టి నారాయణస్వామి, కొత్త శ్యామ్, చెంగలి నాగరాజు, రామన్న తదితరులు పాల్గొన్నారు.