సాధన స్కూల్ హెడ్మాస్టర్ సీతాపతి రావు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల సాధన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు హెడ్మాస్టర్ సీతాపతి రావు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నడుమ ఘనంగా నిర్వహించుకున్న రు. అనంతరం సీతాపతి రావు మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైనదని, తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రీకృష్ణుని, గోపికల వేషధారణ వేయించి, దైవ ఆశీస్సులు పొందుతారని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో కూడా చిన్నారులకు శ్రీకృష్ణ రాధిక గోపికల వేషాలు వేసుకొన్న వైనం అందరినీ ఆకట్టుకుంది అని తెలిపారు. అనంతరం శ్రీకృష్ణ లీలలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.