టూ టౌన్ సీఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మారుతీ నగర్ లో పేకాట ఆడుతున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.42,500 నగదు స్వాధీనం చేసుకున్నట్ల టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు మారుతీ నగర్ లో ఓ ఇంటిపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. పేకాట ఆడుతున్న ఆరు మందిని అదుపులో తీసుకొని, నగదును స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. తదుపరి ఆరు మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.