London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

మున్సిపల్ టీచర్ల సమస్యలను పరిష్కరించండి -యుటిఎఫ్ డిమాండ్

.విశాలాంధ్ర-ధర్మవరం ; మునిసిపాలిటీ టీచర్ల సమస్యలను పరిష్కారించాలన్న డిమాండ్లతో ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాశాఖ అధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యుటిఎఫ్ నాయకులు స్థానిక ధర్మవరం ఎం ఆర్ సి కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగి సుమారు 10 సంవత్సరాలు కావస్తున్నదీ అని, ఈనాటికి ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు, ఉత్తర్వులు ఇదే వ్యవస్థలో భాగంగా ఉన్న మున్సిపాలి టీచర్లకు మాత్రం వర్తించడం లేదు అని తెలిపారు. అదేవిధంగా
పి ఎఫ్ సమస్య మున్సిపాలిటీచర్లకు పరిష్కారం కాలేదు అని, ఎన్నిసార్లు ప్రాతినిథ్యాలు చేసిన మున్సిపల్ సమస్యల్లో పురోగతి లేదు అని మండిపడ్డారు. అందుకు రాష్ట్ర యుటిఎఫ్ శాఖ పిలుపుమేరకు మునిసిపల్ టీచర్ల సమస్యల పరిష్కారానికై దశల వారి ఉద్యమాన్ని చేపట్టింది అని తెలిపారు.
యుటిఎఫ్ డిమాండ్లో
మున్సిపల్ హైస్కూల్లో తగినంత సబ్జెక్ట్ టీచర్లను నియమించేందుకు వీలుగా ఎస్జీటీ ,పండిత్ ,పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి అని, నవంబర్లోగా అప్గ్రేడ్ పోస్టులలో మున్సిపాలిటీ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి అని, మునిసిపల్ ప్రధానోపాధ్యాయుల్లో అర్హులైన వారికి అర్బన్ ఎంఈఓ గా నియమించాలి అని తెలిపారు.
మున్సిపల్ టీచర్లకు జిపిఎఫ్ ఖాతాలు తెరవాలి అని,
మున్సిపల్ పాఠశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.
మున్సిపల్ టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తో పాటు జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ రామకృష్ణ నాయక్, అర్బన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సాయి గణేష్, యుటిఎఫ్ నాయకులు లక్ష్మయ్య, రాంప్రసాద్, హెచ్.రామాంజనేయులు, హరి శంకర, ఆంజనేయులు, కుళ్ళాయప్ప, అమర్నారాయణ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img