విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని పలు వినాయక నిమజ్జన ప్రదేశాలను జిల్లా ఎస్పీ రత్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెరువులో వినాయక నిమజ్జన వేడుకలను వారు పర్యవేక్షించారు. చెరువులో క్రేన్ల సహాయంతో వినాయక విగ్రహాలు చేస్తుండగా గట్టి పోలీస్ బందోబస్తును కూడా వారు ఏర్పాటు చేయించారు. ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక నిఘాను పోలీసులు ఉండాలని సూచించారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఈతరాణి నిర్వాహకులు చెరువులోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. వినాయక పండుగ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సిఐలను ఎస్ఐలను ఆదేశించారు. వీరి వెంట వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.