విశాలాంధ్ర ధర్మవరం ; జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం జరిగిందని అధ్యక్షులు అంకె రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని రంగా థియేటర్ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 38 మంది రక్తదాతలు తమ రక్తాన్ని ఇవ్వడం పట్ల వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేశారు. రక్త దాతలు ఇచ్చిన రక్తాన్ని బత్తలపల్లి లోని తల సేమియా వ్యాధిగ్రస్తులకు అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు వెంకటేష్, రమేష్, నవకుమార్, ముత్యాలు, తుకారాం, చరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు..