యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం.
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్ట ణంలో తేరు బజారులో గల ఆర్య వైశ్య కొత్త సత్రములో యువర్స్ ఫౌండేషన్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు, పాదముల స్పర్శ పరీక్షల శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరామ్, కోశాధికారి బండి నాగేంద్ర, పిఆర్వో రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం సత్రంలో నిర్వహించిన శిబిరం లో ఉచిత మధుమేహ పరీక్షలు ఈసీజీ, పాదముల స్పర్శ పరీక్షలు రక్తపోటు పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయడం జరిగిందని తెలిపారు. 150 మందికి వైద్య చికిత్సలను అందజేసి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరం జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాసికులర్ సైన్స్ (ఏ యూనిట్ ఆఫ్ భగవాన్ మహావీర్ జైన్ హాస్పిటల్ వసంత నగర్ బెంగళూర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. డాక్టర్ మనోజ్, డాక్టర్ మురళీధర్, సీఈఓ అశోక్ బాబు, కోఆర్డినేటర్ మంజునాథ్ వారి పర్యవేక్షణలో నాణ్యమైన వైద్య చికిత్సలను అందించడం జరిగిందని తెలిపారు. దాదాపు 3వేల రూపాయలు విలువచేసే పరీక్షలను ఈ శిబిరములో ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఈ శిబిర నిర్వహణకు దాతలుగా డాక్టర్ బి వి సుబ్బారావు, బాలం ఆదిశేషు, రిటైర్డ్ హిందీ పండిట్ సుబ్బరత్నమ్మలు వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాంద్ బాషా, గర్రె రమేష్ బాబు, బండ్లపల్లి రంగనాథ్, ఓవి ప్రసాద్, పోలా ప్రభాకర్, వంకదారి మోహన్, జయంతి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.