విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని కా యగూరుల మార్కెట్ వద్ద గల పరకాల మఠములో గరుడ ఐ కేర్ అనంతపురం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించడం జరిగిందని పరకాల మఠం ఇన్చార్జ్ కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 80 మంది కంటి రోగులను డాక్టర్ మానస వైద్య చికిత్సలను అందిస్తూ కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారని తెలిపారు. తదుపరి ఆపరేషన్కు ఎంపికైన వారికి తగిన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ , హరి తదితరులు పాల్గొన్నారు