ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్మవరం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు క్రీడలను ఈనెల 12,13 తేదీలలో(రెండు రోజులపాటు) నిర్వహించాలని సమావేశంలో ఎంఈఓ గోపాల్ నాయక్, మండల కోఆర్డినేటర్ పిడి రఘునాథ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగేంద్ర తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎఫ్ జి ఎఫ్ ఐ గేమ్ లో వాలీబాల్, కోకో, కబడి ,బ్యాడ్మింటన్, చెస్, యోగ , అథ్లెటిక్స్ లలో బాలురు , బాలికలకు అండర్ 14 అండర్ 17 విభాగాలలో నిర్వహిస్తారని మండల కోఆర్డినేటర్ పిడి రఘునాథ్ నియోజవర్గ కోఆర్డినేటర్ నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సరళ, ఇతర పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.