విశాలాంధ్ర -ధర్మవరం ; ఇటీవల కొన్ని రోజుల కిందట విజయవాడలో తీవ్రంగా వరద రావడంతో విజయవాడ ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వము కూడా తమవంతుగా సహాయ సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు విజయవాడ వరద బాధితుల కొరకు వారిని ఆదుకునే విద్యార్థులు అందరూ కలిసి 50వేల రూపాయలను చందాగా వేసుకొని, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కరెస్పాండెంట్ ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డోలా పెద్దిరెడ్డి, అధ్యాపకులు విద్యార్థినీలు పాల్గొన్నారు.