గొర్తి భారతీదేవి, గొర్తి సుధాకర్ నాయుడు
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు గొర్తి భారతీదేవి, గొర్తి సుధాకర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం ప్రజల క్షేమం కొరకు, పట్టణ అభివృద్ధి కొరకు, రైతు సంక్షేమం కొరకు ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించామని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్ కుమార్ తదితర పట్టణ ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిగిచెర్ల ఓపిరెడ్డి, మంత్రి ముఖ్య అనుచరుడు హరీష్, డోలా రాజారెడ్డి, సాకే ఓబులేష్, జింక చంద్రశేఖర్ లతోపాటు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.