ధర్మవరం డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర -ధర్మవరం:: పుట్టపర్తి డిపో నుండి ధర్మవరం మీదుగా మరో నూతన సర్వే శ్రీశైలం కు ప్రారంభించడం జరిగిందని ధర్మవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మారం నుండి ఈ బస్సు రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుందని, రిజర్వేషన్ సౌకర్యం కు సౌకర్యము ఆన్లైన్ ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకునే అవకాశం కలదు అని తెలిపారు. రాను పోను రిజర్వేషన్ చేసుకొనిన యెడల పది శాతం రాయితీ కల్పించబడునని తెలిపారు. కావున ఈ సదా అవకాశాన్ని ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ధర్మారం నుండి చెన్నై కు నూతన బస్సు కూడా ప్రారంభించబడినదిని, ఈ బస్సు వయా కొత్తచెరువు, పుట్టపర్తి, నల్లమడ, కదిరి, తిరుపతి ద్వారా చెన్నైకు వెళుతుందని తెలిపారు. ఈ బస్సు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కలగని తెలిపారు. తదుపరి తిరుమల నందు మా బస్ సర్వీస్ ద్వారా టీటీడీ 300 రూపాయలు దర్శనం టికెట్లు కూడా పొందే అవకాశం ఉందని తెలిపారు. రాను పోను రిజర్వేషన్ చేసుకొనిన యెడల 10 శాతం రాయితీ కూడా పొందే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా హనుమాన్ దర్శన్ బస్సులు కూడా ప్రారంభించడం జరిగిందని, ధర్మవరం నుండి కసాపురం, నెమకల్లు, మురడి, ఒకే రోజులో దర్శనం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందు కొరకు ప్రత్యేక బస్సులను కూడా మంగళ శనివారాలలో నడుపుతున్నట్లు తెలిపారు. పెద్దలకు 580 రూపాయలు పిల్లలకు 300 రూపాయలు చార్జీలు ఉంటాయని తెలిపారు. ఈ బస్సుకు కూడా రిజర్వేషన్స్ సౌకర్యం కలదు అని తెలిపారు. ప్రతి మంగళ శనివారాలలో ఆర్టీసీ బస్టాండ్ నుండి ఉదయం 5:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది అని తెలిపారు. కావున భక్తాదులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.