పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం ; విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనమును అందించాలని పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని గొట్లురు గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం రుచికరంగా లేదని తెలిపారు. విద్యార్థుల పాటు పి ఎస్ నాయకులు భోజనం చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను కూడా పరిశీలించారు. తదుపరి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హెడ్మాస్టర్ తో నాయకులు మాట్లాడుతూ నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే చదువు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంద కిషోర్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు