Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

చేనేత కార్మికులను ఆదుకోండి

కలెక్టర్ , హ్యాండ్లూమ్ అధికారికి వినతి పత్రాలు అందజేత
విశాలాంధ్ర ధర్మవరం:: చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చేతన్కు, హ్యాండ్లూమ్ అధికారి రమేష్ కు వినతి పత్రాన్ని చేనేత కార్మికులు, నాయకులు, ధర్మాంబా వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలుచోట్ల రాంనగర్ నుంచి కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీని నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పవర్ లూమ్స్ వద్దు, హ్యాండ్లూమ్ మగ్గాలే ముద్దు అన్న నినాదంతో వారు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు ధర్మవరంలో చేనేత పరిశ్రమను నమ్ముకున్న చేనేత కార్మికుల పరిస్థితి దుర్భిక్షంలో ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ధర్మవరంలో నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం, ముడి సరుకులు ధరలు పెరిగిపోవడం, కుటుంబాన్ని పోషించుకోలేక ఇప్పటికే పదుల సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని బాధను వ్యక్తం చేశారు. చేనేతలకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించకపోతే, చేనేత పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికులు కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా ధర్మవరంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసును ఏర్పాటు చేయాలని, జీవో రిజిస్ట్రేషన్ ప్రకారం వారసత్వ వృత్తి, చేనేత రక్షణ కోసం, చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేత రంగాన్ని అన్ని విధాలుగా పునరుద్దించి, పవర్లూమ్స్ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా చేనేత కార్మికులకు మూడు సెంటలో ఇంటి స్థలము ఇచ్చి, మగ్గం చేనేత వర్క్ షెడ్డును ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని తెలిపారు. చేనేత సొసైటీలను, ఆప్కో లను ఉమ్మడి జిల్లా నుంచి శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింత శ్రీనివాసులు, మిట్టా చంద్రశేఖర్, చట్ట గంగాధర్, నరసింహ, నాగరాజు, బాలకృష్ణ, మాధవ, గోపాల్, రామాంజి, అంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img