ఎంపీడీవో అబ్దుల్ నబీ
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో అబ్దుల్ నబీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ, విద్యార్థులతో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులతో, ఎస్హెచ్జి సభ్యులతోను ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేసి, గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. గ్రీన్ అంబాసిడర్స్ కు వైద్య పరిచారు కూడా నిర్వహించామని స్కూలు పిల్లలకు, గ్రామ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పైన అవగాహన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రావులచెరువు ప్రాథమిక పాఠశాల ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మాత్రలు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావల చెరువు విస్తరణ అధికారి, రేగాటిపల్లి నందు మండల విద్యాధికారి, పోతుకుంట నందు మండల విద్యాశాఖ అధికారి, అసిస్టెంట్ ఇంజనీర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.