ధర్మవరం ఇంచార్జ్ హెడ్ పోస్ట్ మాస్టర్ వేదాంతులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రజలకు ఉపయోగపడే పలు స్కీములను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జ్ హెడ్ పోస్ట్మాస్టర్ వేదాంతు లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తపాలా కార్యాలయంలో కేవలం 100 రూపాయలతో ఖాతాను ప్రారంభించవచ్చునని, అంతేకాకుండా మా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏటీఎం కార్డును పొందడంతో పాటు, ఏ బ్యాంకులో నగదు ఉన్నా కూడా మా ఏటీఎం కార్డు ద్వారా నగదును పొందే అవకాశం ఉందని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ లో ఆర్ డి, సేవింగ్ బ్యాంక్, టైం డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, (డిపాజిట్ నగదు డబుల్ అవుతుంది), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్,( ఐదు సంవత్సరాలు), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, (15 సంవత్సరాలు) మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ (అత్యధిక వడ్డీ 7.5 శాతము), సుకన్య సమృద్ధి యోజన పుట్టిన పాప నుండి 10 సంవత్సరాల లోపు నెల నెల నగదు కట్టుకునే అవకాశం-15 సంవత్సరాలు మాత్రమే కట్టుట-ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఇంతే కాకుండా పలు పథకాలు కూడా మా తపాలా కార్యాలయం ద్వారా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీ ఉజ్వల భవిష్యత్తుకు మంచి బాట వేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు నేరుగా మా తపాలా కార్యములో తెలుసుకోవడం వచ్చునని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు కూడా మా తపాలా కార్యాలయంలో ఖాతాను ప్రారంభించుకోవచ్చునని కూడా వారు తెలిపారు.