విశాలాంధ్ర -ధర్మవరం : క్రీడల్లో పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని హెడ్మాస్టర్ మేరీ వర కుమారి పిఈటి అశ్విని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్ 14, అండర్ 17, డివిజన్ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో కబడ్డీ నందు అండర్ 14 లో సాయి జ్యోతిక, హిమబిందు, జోష్ణవి, వైష్ణవి ,మానస రాగా అండర్ 17 లో కబాడీ లో నవ్య అశ్విత దివ్యశ్రీ లు జిల్లా స్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. అలాగే అతెట్లిక్సలెందు నవ్య, హష్మిత,శ్రీ రునికా, జిల్లా సాయికి ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక కాబడిన కూడా హెచ్ఎం తో పాటు, పిఈటి, పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు