Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

ఘనంగా జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ప్రిన్సిపాల్ ప్రశాంతి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామము నుండి చదువుకొని, న్యాయవాది వృత్తిని చేపట్టి, అనంతరం స్వరాజ్యం అనే దినపత్రిక తెలుగు, తమిళ సంచికలలో ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కృషి చేశాడని తెలిపారు. దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు ప్రకాశం పంతులు అని వారు తెలిపారు. భారత రాజకీయవేత్త, స్వాతంత్ర సమరయోధుడు, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదట ముఖ్యమంత్రి మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్ర కేసరి అని పేరు పొందిన మహా వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్. పివో. కుల్లయిరెడ్డి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రధాన శాఖ గ్రంథాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుక లను సిబ్బంది సత్యనారాయణ, రమణ నాయక్, శివమ్మ, పాఠకులు నడుమ జరుపుకున్నారు. తొలుత ప్రకాశం చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులుగా దేశానికి ఎనలేని సేవ చేశారని, స్వేచ్ఛ స్వతంత్రాల కోసం గర్జించి, జగతిని జాగృతం చేసి, యువతలో స్వాతంత్ర ఉద్యమకాంక్షను రహించిన త్యాగధనుడు ప్రకాశం పంతులు అని తెలిపారు. ప్రకాశం పంతులు స్ఫూర్తితో వెనుకబడిన కులాల వారికి సహాయ సహకార అందించాలని తద్వారా సమాజంలో మెరుగైన స్థితికి చేరుకునేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img