విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం ఆర్టీసీ డిపోలోని బస్టాండు నందు వ్యాపారములు చేసుకొనుటకు పక్క ఖాళీ స్థలములు షాపులకు ఐదు సంవత్సరాల గడువుతో వ్యాపార నిర్వహణ నిర్వహణ చేసుకోవచ్చునని, ఇందుకు టెండర్లను దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి గల వ్యాపారస్తులు సీల్డ్ టెండర్లను వేస్తూ ఈనెల 20వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు డిపో మేనేజర్ కార్యాలయంలో ఉదయం 10:00 నుండి సాయంకాలం ఐదు గంటల లోపు 885 రూపాయలు చెల్లించి టెండర్ ఫారం ను పొందవచ్చునని తెలిపారు. టెండర్ ఫారములు అక్టోబర్ 5వ తేదీ జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం పుట్టపర్తి నందు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపల టెండర్ బాక్స్ నందు వేయవలెనని తెలిపారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు తెరవబడునని తెలిపారు. కావున ఆర్టీసీ ఆదాయ అభివృద్ధికి వ్యాపారస్తులు సహకరించాలని వారు తెలిపారు.