దివ్యాంగుల పట్ల వివక్ష చూపకూడదు
సమదృష్టి క్షమత వికాసం(సక్షమ్)జాతీయ సంస్థ కన్వీనర్ పవన్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; దివ్యాంగుల పట్ల విపక్ష చూపకూడదు, దివ్యాంగుల సామర్థ్యాన్ని వెలికి తీయాలి అంటూ సమదృష్టి క్షమత వికాసం జాతీయ సమస్త కన్వీనర్ పవన్ కుమార్ పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా,ధర్మవరం లో సాయి భారతి మానసిక వైకల్యం, వినికిడి లోపం కోసం ప్రత్యేక
(దివ్యాంగ బాలబాలికల పాఠశాల)లో సక్షమ్ (దివ్యంగుల కోసం పని చేస్తున్న జాతీయ సంస్థ)ఆధ్వర్యంలో రాఖీ (రక్షాబంధన్) కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా సక్షమ్ కన్వీనర్ పవన్ కుమార్ సక్షమ్ సభ్యులు శివ నారాయణ మూర్తి, రమేష్,టీచర్ వెంకటేష్, టీచర్ స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.రక్షాబంధన్ విశిష్టతను తెలియజేస్తు దివ్యాంగులపట్ల వివక్ష చూపకూడదని,వారిని అందరితో సమానంగా చూడాలని వారిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రయత్నించాలని వక్తలు తెలిపారు.
విద్యార్థులకు రాఖీలు కట్టి, మిఠాయిలు పంపిణీ చేశారు.