విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 9వ తేదీన కలకత్తాలోని ట్రైనింగ్ డాక్టర్ ను హత్య చేసి కిరాతకంగా చంపిన నిందితుడికి కఠినంగా శిక్షణ విధించాలని ధర్మవరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలు ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ను అతి కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు తెలిపారు. దేశస్థాయిలో ఇలాంటి ఘటన మునుముందు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలివెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అత్యాచారం, మానసికంగా కృంగదీయుట, మహిళలు అని చూడకుండా అనేక హింసలు పెట్టే వారందరికీ కూడా వెనువెంటనే శిక్షపడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతూ నూతన చట్టాలను తీసుకొని రావాలని తెలిపారు. డాక్టర్ కుటుంబానికి తాము సంతాపం తెలుపుతున్నామని తెలిపారు. నాడు దేశస్థాయిలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ఉంటున్నారని, అలాంటప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరమని తెలిపారు. డాక్టర్ కుటుంబానికి తగు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తెలిపారు.