రోటరీ క్లబ్ అధ్యక్షుడు బి. జయసింహ, కోశాధికారి సుదర్శన్ గుప్తా
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్య చికిత్సలతో పాటు కంటి ఆపరేషన్ లను అద్దాలను పంపిణీ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహ, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ బి. రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జయసింహ తో పాటు మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, క్యాంపు చైర్మన్ రామకృష్ణ, నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో రోటరీ క్లబ్ పేద ప్రజలకు వివిధ రకాలుగా సేవలు అందిస్తూ, ముఖ్యంగా కంటి ఆపరేషన్లను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహిస్తోందని తెలిపారు. ఈ శిబిరంలో కంటి రోగులకు వైద్య చికిత్సలు అందిన తర్వాత, ఉచితంగా బెంగుళూరులోని శంకరా కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళుట, అక్కడ అన్ని వసతులతో పాటు తిరిగి ఆపరేషన్ తదుపరి ధర్మవరం నకు పూర్తి ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే వేల సంఖ్యలో పేద ప్రజలకు కంటి చూపులు ప్రసాదించడం జరిగిందని తెలిపారు. కంటి నిపుణులు సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. అంతేకాకుండా షుగర్, బీపీ నియంత్రణ ఉన్నవారికి కూడా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మనిషి పుట్టుకతో పాటు చావు కూడా భగవంతుడు ఇవ్వడం జరిగిందని, మృతి చెందిన తర్వాత తమ కళ్ళను దానం చేయవచ్చునని తెలిపారు. ఈ కళ్ళు మరొకరికి కంటి చూపును ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు. తదుపరి ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు అక్కమ్మ వెంకటప్పల జ్ఞాపకార్థం వీరి కుమారులు సింగమ రెడ్డి గారి రాజారెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్ వారి భార్య సావిత్రమ్మ చేనేకొత్తపల్లి వారి నిర్వహించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు వారిని ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో రక్త దానము తో పాటు నేత్రదానమును కూడా చేయుట ను అలవర్చుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో కంటి డాక్టర్ హేమంత్124 మంది కంటి రోగులుకు వైద్య చికిత్సలు అందించగా, ఇందులో 90 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, శివయ్య, కొండయ్య, శ్రీనివాసుల రెడ్డి, మనోహర్ గుప్తా, కృష్ణమూర్తి, విజయభాస్కర్, శంకరా కంటి ఆసుపత్రి కోఆర్డినేటర్ శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.